జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 30 : దేశ స్వాతంత్ర్య పోరాటంలో త్యాగధనుల సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మహాత్మాగాంధీ వర్థంతిని పురస్కరించుకొని జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని స్వాతంత్య్ర సమరయోధుల సేవలను స్మరించుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో సత్యం,అహింసా మార్గంలో అలుపెరుగని పోరాటం చేసిన మహాత్మాగాంధీ దేశానికి అందించిన సేవలు సదా స్మరణీయమని,జాతిపితగా గౌరవించుకుంటున్నామని అన్నారు.మహనీయులు చూపిన మార్గాలను ఆచరిస్తూ దేశాభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్,సంబంధిత అధికారులు,కలెక్టరేట్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.