ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
ఎస్సారెస్పీ రైతులకు రేపటి నుంచి సాగు నీటి విడుదల.
ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శితో మాట్లాడిన ఎమ్మెల్యే.
ఎస్సారెస్పీ నుంచి నీటిని డిఫాక్టో సీఎం దోచుకెళ్తున్నారనీ ఏలేటి ఆగ్రహం.
ఎస్సారెస్పీ నుంచి 8 టీఎంసీల నీటిని ఇక్కడి నుంచి తీసుకెళ్లారు.
చేతికొచ్చిన పంట ఎండిపోతుండటంతో అన్నదాతలు ఆవేదన
42 ముంపు గ్రామాలు వ్యవసాయంమీదే బతుకుదెరువు.
సరస్వతి కెనాల్ ద్వారా 6 టీఎంసీల నీరు అలాట్ చేస్తే…
కేవలం నాలుగున్నర టీఎంసీల నీరు మాత్రమే ఇచ్చారు.
ప్రాజెక్టు ఎండిపోయిందని మిగతా టీఎంసీన్నర నీరు ఇవ్వలేదు.
ఇలా.ఉత్తర తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నారు.
ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు
మంత్రి శ్రీధర్ బాబు తీరుతో అన్నదాతలకు తీవ్ర నష్టం.
ఎస్సారెస్పీ ముంపు గ్రామాలకు కూడా నీరివ్వడం లేదు.
పంటలు ఎండినష్టపోయి, రైతులు అప్పులపాలవుతున్నారు.
అన్నదాతల దుస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వమే కారణం.
రైతుల పక్షాన వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కో మంత్రిది ఒక్కో తీరు.
గత ప్రభుత్వం లెక్కే కాంగ్రెస్ కూడా దోచుకోవడం, దాచుకోవడం.
ఈ కార్యక్రమంలో. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, బీజేపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.