కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పరిశీలకులుగా మతిన్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్మల్ అసెంబ్లీ పరిశీలకులుగా జిల్లా కేంద్రానికి చెందిన ఎం. ఏ మతిన్ నియమితులయ్యారు. ఎఐసీసీ మైనార్టీ విభాగం వైస్ చైర్మన్, తెలంగాణ ఇన్చార్జ్ ఫర్హాన్ అజ్మీ నియమాంకలను ప్రకటించారు. ఈ సందర్భంగా మతిన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సుగుణ విజయం కోసం నిర్మల్ నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయమని పేర్కొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking