ప్రజాబలం కొల్చారం మండలం సెప్టెంబర్ 21
మెదక్ జిల్లా కొల్చారం మండలం గ్రామం వరిగుంతం గ్రామపంచాయతీ సీతారాం తండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ యొక్క 500/-రూపాయలు సబ్సిడీ బాండ్ పేపర్లను గ్రామపంచాయతీ నందు లబ్దిదారులకు ఎంపిక చేయగా ఎంపికైన లబ్ధిదారులకు పంపిణి చేయడం జరిగింది సీతారాంతండా గ్రామ సెక్రటరీ రాజేశ్వరి చేతుల మీదుగా పంపిణి చేసారు.
రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు తీసుకొని వచ్చి బాండ్లను తీసుకెళ్లగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ భారతి మాజీ స్కూల్ చైర్మన్ పి సంతోష్ మాజీ వార్డు మెంబర్ శివ మరియు ఇశ్రా నాయక్,మోహన్ నాయక్, రామ్ కోటి, తదితరులు పాల్గొన్నారు