తెలంగాణ ఉద్యమకారులఫోరం అధ్వర్యంలో ఆర్డిఓ కీ జమ్మికుంట మండల కేంద్రంలో వినతిపత్రం.

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 21

జమ్మికుంట మండలోని కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో ఆర్డిఓ కి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుల ఫోరం పక్షాన ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన ప్రభుత్వంగా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా నాయకులు తెలపడం జరిగింది. ప్రభుత్వం అనేక వర్గాలకు పెద్దపీట వేస్తుందని, అలాగే తెలంగాణ ఉద్యమకారుకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెన్షన్ అమలు చేయాలని, తెలంగాణ ఉద్యమకారుకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ఉద్యమకారుల పక్షాన కోరడం వారు జరిగింది.ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ ఎక్కటి సంజీవరెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అద్యక్షులు కనకం కుమారస్వామి, మాజీ జడ్పిటిసి అరుకాల విరేషలింగం, ఊకంటి మల్లాచారి, తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు జవ్వాజి కుమార్(జే.కె), కొమ్ము అశోక్, అన్నం ప్రవీణ్, దబ్బట రాజు, ఆకుల రాజేందర్, మల్లేష్, మూడెడ్ల కుమార్, కంది దిలీప్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బిజిగిరి శ్రీకాంత్, మద్దూరి శంకరయ్య, వాసాల రామస్వామి, రాం చంద్రమౌలి, రజినికాంత్, ఎర్ర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking