అసంబద్ధమైన సర్దుబాటు ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి : తపస్

 

చేగుంట , 21/09/24ప్రాజబలం న్యూస్ :-

చేగుంట లో తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్య ఆధారంగా సర్దుబాటు చేయుటకు గాను కలెక్టర్లకు విద్యాశాఖ అనుమతినిచ్చిన నేపథ్యంలో అట్టి ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని వారన్నారు. ప్రభుత్వ పాఠశాలల లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తుందని, నిర్ణీత సమయంలో నిర్దేశించిన విద్యా ప్రమాణాలను మరియు సామర్ధ్యాలను విద్యార్థులకు నేర్పించడం అత్యంత కఠినంగా మారిందని,ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేదా ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు మాత్రమే సరియైన విధంగా బోధనాభ్యసన జరుగుతుందని,ప్రభుత్వం యొక్క ఇలాంటి చర్యల వల్ల ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి పని భారం పడుతుందని,గ్రామీణ ప్రాంతాలలో విద్యాభివృద్ధికి ఇలాంటి చర్యలు తీవ్ర విఘాతం కలిగిస్తాయని అందుకే వీటిని వ్యతిరేకిస్తున్నామని,గడిచిన 10 సంవత్సరాలలో విద్యా వ్యవస్థ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటుందని నూతన ప్రభుత్వంలో ఈ సమస్యలకు కొంతైనా ఉపశమనం జరుగుతుందని భావించామని కాని తిరిగి ఈ సర్దుబాటు వల్ల సమస్య తీవ్ర రూపం దాలుస్తుందని వారు అన్నారు. కార్యక్రమంలో తపస్ జిల్లా ఉపాధ్యక్షుడు దేశపతి కృష్ణమూర్తి, చేగుంట నార్సింగి మండల అధ్యక్షులు రావుల వెంకటేష్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking