జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 21
జమ్మికుంట పట్టణంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డికి మద్దతుగా విఎన్ఆర్ యూత్ ఫోర్స్ నాయకుల ఆద్వర్యంలో శనివారం పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. జమ్మికుంట పట్టణ పరిధిలోని పట్టభద్రుల ఇళ్లకు వెళ్లి వారికి ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహాన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని లక్షలాది మంది పట్టభద్రుల ఆకాంక్షలు నెరవేర్చడానికి వి నరేందర్ రెడ్డి ముందుకు వస్తున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిఏ, ప్రైవేట్ ఉద్యోగులకు పన్నెండు నెలల వేతనం, రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు, ఇతర సమస్యలపై శాసన మండలిలో పోరాడే శక్తి అన్న నాయకుడని తెలిపారు. విద్యా రంగం పటిష్టత, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అహర్నిశలు కృషి చేసే సత్తా ఉన్నా వ్యక్తి అని కొనియాడారు. ఆలాంటి యువ నాయకుడికి మన అందరం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాంత పట్ట భద్రులు అంతా ఒక తాటిపైకి వచ్చి భారీ మెజార్టితో గెలిపించుకోవాలని, ఇందుకోసం పట్టభద్రులు అందరు ఓటర్ నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విఎన్ ఆర్ యూత్ ఫోర్స్ నాయకులు
రాజు, రఫీ నాగరాజు, సమ్మయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు.