తెలంగాణ రాష్ట్రంలో రెండవ కొండగట్టుగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా తూప్రాన్ పెద్ద చెరువు కట్ట వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద గురుస్వామి శలక ఆత్రేయ శర్మ ఆధ్వర్యంలో మండల దీక్షలు ప్రారంభమయ్యాయి.
అత్యంత భక్తిశ్రద్ధలతో, కటోర నియమ నిష్ఠలతో హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములు 41 రోజులు శ్రీరామ నామస్మరణతో భజన చేస్తూ , దైవ సేవ కార్యక్రమాలు, భక్తి భావంతో మండల దీక్షలు, అర్థ మండల దీక్షల తో హనుమాన్ అనుగ్రహాన్ని పొందుతారు. క్రీస్తు శేషులు సలాక శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాల క్రితం ఈ క్షేత్రంలో హనుమాన్ మాలాధారణ, విరమణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని అప్పటినుండి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం ఈ క్షేత్రం దినదిన అభివృద్ధి చెందుతూ భక్తుల కోరిన కోరికలను తీరుస్తూ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతుందని ఆలయ పూజారి సలాక ఆత్రేయ శర్మ తెలిపారు. సుమారు 300 మంది భక్తులు ఈ క్షేత్రంలో మాలాధారణ గావించి ఇక్కడే విరమణ పొందుతారని ఆయన తెలిపారు.
