వీణవంక ప్రజాబలం ప్రతినిధి మార్చి 12
బిసి రాజకీయ పోరాట సమితి వీణవంక మండల అధ్యక్షులుగా మండల పరిధిలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన వడ్డేపల్లి రాజగోపాల్ నీ నియమిస్తున్నట్లు బీసీ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్, అసెంబ్లీ అధ్యక్షులు చిలకమారి శ్రీనివాస్ లు నియామక పత్రాన్ని రాజగోపాల్ కు అందజేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ బీసీ రాజకీయ పోరాట సమితి అధ్యక్షులుగా నాపై నమ్మకంతో నియమించినందుకు రాష్ట్ర కమిటీకి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాపై నమ్మకంతో నాకు అప్పచెప్పిన బాధ్యతను బీసీ కులాలను ఐక్యం చేసి వారికి రాజకీయపరంగా ఫలాలు అందే విధంగా కృషి చేస్తానని అన్నారు. వీణవంక మండలంలోని ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలను నియమించి బిసి రాజకీయ పోరాట సమితి గ్రామ గ్రామాన బలపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని రాజగోపాల్ తెలిపారు.