రంజాన్ పండుగ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

రంజాన్ నెల ప్రారంభ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఆయన సోమవారం కలెక్టరేట్ సమవేశమందిరంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రశాంత వాతావరణం రంజాన్ పండుగను నిర్వహించుకొనేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఏటువంటి పుకార్లను ప్రజలు నమ్మవద్దని అన్నారు. పుకార్లను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పండగ నిర్వహణకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఎలాంటి అవాంఛనియా ఘటనలు జరుగకుండా ప్రజల భాగస్వామ్యంతో రంజాన్ పండుగను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ గంగయ్య, ఆర్డిఓ లు రత్నాకళ్యాణి, మున్సిపల్ కమిషనర్ రాజు, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking