లక్షెట్టిపేట పురపాలక సంఘ కార్యాలయం 2023-2024 ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్ సమావేశం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 11 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పురపాలక సంఘం కార్యక్రమం 2023-24 ఆర్ధిక సంవత్సరంపు సవరణ బడ్జెట్ మరియు 2024-25 ఆర్ధిక సంవత్సరంపు అంచనా బడ్జెట్ నకు సంబంధించిన బడ్జెట్ ప్రత్యేక సమావేశము తేదీ 11 03.2024 సోమవారం రోజున పురపాలక సంఘ కార్యాలయం,లక్షెట్టిపేట కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మున్సిపల్ కమిషనర్ కల్లేడ రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించుకోవడము జరిగినది.ఈ సమావేశము నందు జెఏఓ సి.హెచ్.అనిత దేవి,బడ్జెట్ ఎజెండాను చదివి వివరించగా గౌరవ కౌన్సిల్ సభ్యులు రూపాయలు. 12.14 కోట్ల గాను 2024-25 ఆర్ధిక సంవత్సరంపు బడ్జెట్ ఏకగ్రీవముగా ఆమోదించినారు. ఈ బడ్జెట్ సమావేశములో జిల్లా అదనపు పాలనాధికారి బి రాహుల్,వైస్ చైర్మన్ పోడేట్టి శ్రీనివాస్,కౌన్సిల్ సభ్యులు కో-ఆప్షన్ సభ్యులు,జె ఏ ఓ సి.హెచ్.అనితా దేవి,కార్యాలయ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.

Breaking