బీసీ లలో ఆత్మ గౌరవాన్ని నింపింది సీఎం కేసీఆరే

– తెలంగాణా రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు

• సంచార, వడ్డెర కులాల ఆత్మ గౌరవ భవన స్థలాలలో భూమి పూజ, శిలా ఫలకానికి శంకుస్థాపన చేసిన డాక్టర్ వకుళాభరణం.
• దేశంలో ఎక్కడా లేని విధంగా బలహీన వర్గాల కుల భవనాలకు వేలాది కోట్ల విలువ చేసే ఖరీదైన స్థలాలను కేటాయించే ఘనత సీఎం కేసీఆర్ దే.
• బలహీన వర్గాలంటే నైతికత, నిబద్ధత, నిజాయితీకి, ఐక్యతకు ఆలంభనగా నిలిస్తేనే గౌరవం లభిస్తుంది.
• కుల సంఘాలలో ఐక్యతను దెబ్బ తీసేందుకు కొంత మంది పనిగట్టుకున్నారు తస్మాత్ జాగ్రత్త.
బీసీ, MBC, సంచార, అర్థ సంచార, సామాజిక వర్గాలు ఐకమత్యంతో తమ ఉనికిని చాటుకున్నప్పుడే సమాజంలో సముచిత గౌరవం లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. బలహీన వర్గాలను అన్ని రంగాలలో ఎదిగించడానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అముల్యమైనది అన్నారు. వేలాది కోట్ల రూపాయల ఖరీదైన భూములను ఉచితంగా కుల సంఘ భవనాలకు కేటాయించి ఈ వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచడంలో సీఎం కేసీఆర్ దార్శనికత అనిర్వచనీయమైనదని డాక్టర్ వకుళాభరణం అన్నారు.
బుధవారం నాడు ఉప్పల్ భగాయత్ లో వడ్డెరలకు కేటాయించిన ఒక ఎకరం, సంచార కులాలకు కేటాయించిన పది ఎకరాలకు భూమి పూజ చేసి, శిలా ఫలకాలను డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు శంకు స్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, కె. కిశోర్ గౌడ్ లతో పాటుగా బీసీ సంక్షేమ అధికారులు, కె. అలోక్ కుమార్, డి. శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు, వడ్డెర, సంచార కులాల ప్రతినిధులు ఆలకుంట హరి, ఎత్తరి అంతయ్య, ట్రస్ట్ ఛైర్మన్ జరిపాటి సత్యనారాయణ రాజు, వెంకట స్వామి, మొగిలి వెంకట స్వామి, మురారి, డాక్టర్ ఒర్స్ కృష్ణయ్య, ఒంటేద్దుల నరేందర్, నాగరాజు, వై. వెంకట నారాయణ, భూపతి సాగర్, పాండు వంశరాజ్, మల్లేశం వంశరాజ్, బెక్కం వెంకట్, నరహరి, వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ… బీసీ వర్గాలలో అనైక్యత తెచ్చి, ఈ వర్గాలలో చిచ్చు పెట్టే వ్యక్తులను ప్రోత్సహించరాదని హితవు పలికారు. సీఎం కేసీఆర్ బలహీన వర్గాల ప్రగతికి ఎంత గొప్పగా కృషి చేస్తుంటే హర్షించాల్సింది పోయి కొంత మంది అనుచిత వ్యాక్యలకు దిగడం తగదని ఆయన సూచించారు. అలాంటి వికృత చేష్టలు ప్రతిష్టను దిగాజార్చుతాయు తప్ప ప్రయోజనము ఏమీ ఉండదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల సంఘీయులు అప్రమత్తతతో మెలగాలని ఆయన కోరారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ రంగానికి వార్షిక బడ్జెట్ లో 40% నిధులను కేటాయిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ఆయన తెలిపారు. తెలంగాణ లో ప్రతి పథకం పేద, దిగువ, మధ్య తరగతి ప్రజల శేయస్సును ఉదేశించి అమలులోకి తెచ్చినవే అని డాక్టర్ వకుళాభరణం పేర్కొన్నారు. ఇక్కడి సంక్షేమ పతకాలు “రోల్ మోడల్ స్కీం” లుగా దేశాన్ని ఆకర్షిస్తున్నాయని ఆయన తెలిపారు. ఆనతి కాలం లోనే సంక్షేమ పథకాల అమలులో దేశం లోనే నెంబర్ 1 సంక్షేమ రాష్ట్రం గా తెలంగాణ నిలబడగల్గిందని డాక్టర్ వకుళాభరణం సాధికారికంగా తెలిపారు.
బుధవారం నాడు ఉప్పల్ భగాయత్ లో ఈ భూమి పూజల సందర్భంగా వడ్డెర కులస్తులు, సంచార కులాల, జాతులకు సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున తండోప తండాలుగా తరలి వచ్చి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు విఘాతం కలిగించాలని చూసిన పలువురికి అవమానమే ఎదురైంది. వివధ రాజకీయ పక్షాలకు చెందిన వ్యక్తులు కార్యక్రమాలకు అంతరాయం కలిగించాలని ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు తిప్పి కొట్టడంతో వారు వెనుదిరగాల్సి వచ్చింది. కార్యక్రమాల ఆసాంతం అక్కడే వుండి డాక్టర్ వకుళాభరణం జయప్రదం చేసి ప్రభుత్వం యొక్క పథకాల గురించి, కేసీఆర్ దార్శనికత గురించి గొప్పగా వివరించి అద్భుత ప్రసంగం తో సభను ఉర్రూతలూగించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking