జానయ్య అక్రమాలపై సీరియస్ అయిన కమీషన్
హైదరాబాద్ ఆగష్టు 30 ();నల్గొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గా కొనసాగుతున్న వట్టే జానయ్య యాదవ్ బారీ నుండి రక్షించాలంటూ వట్టే జానయ్య బాధితులు బుదవారం మనవ హక్కుల కమిషన్ ను వేడుకున్నారు. సూర్యాపేటలో నయా నయీం..లా రాజ్యమేలుతున్నాడని,సారు కన్ను పడిందా కబ్జానే…పేదల కడుపు కొట్టి కోట్లకు పడగెత్తిన కబ్జాకోర్…అని బాదితులు పిరియాదు చేసారు.అనంతరం వారు మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గా కొనసాగుతున్నాడని,.హోదాకు చేసే పనులకు అస్సలు సంబంధం ఉండదు.ప్రస్తుతం సూర్యాపేట బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్న జానయ్య యాదవ్ ఇన్నాళ్లు అదికారాన్ని అడ్డం పెట్టుకుని చేయని దందా లేదు.పేదలకు భూములు ఆక్రమించడం,అడిగిన వారిని బెదిరించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు..కాగా ఇన్నాళ్లు ఆయన అదికార పార్టీలో ఉండడం తో…పోలీసులకు పిర్యాదు చేయడానికి భాదితులు వెనకడుగు వేశామన్నారు..ఇక రాను రాను జానయ్య అరాచకాలు మితి మీరడం తో పార్టీ పెద్దలు ఆయన్ని పక్కన పెట్టేశారన్నారు.. సుమారు 50 మంది బాధితులు జానయ్య ఆగడాలపై ఎస్పీకి పిర్యాదు చేశామన్నారు.కాని తమకు న్యాయం జరుగాలేదన్నారు. అంతేకాదు జానయ్య యాదవ్ వల్ల తమకు ప్రాణ హాని ఉందని,రక్షణ కల్పించాలని కూడా పిర్యాదు లో పేర్కొన్నట్లు తెలిపారు. బెదిరింపులకు, దౌర్జన్యాలకు , కబ్జాలకు , దాడులకు గురైన తీరును చెప్పుకుంటూ బాధితులు కమిషన్ ముందు వాపోయినారు.జానయ్య అక్రమాలపై సీరియస్ అయిన కమీషన్ అతని అక్రమాల నివేదిక తో కమిషన్ ముందు హజరవ్వాలని జిల్లా ఎస్పీ ని కమిషనర్ ఆదేశించారు.