దీక్ష చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన డీసీసీ అధ్యక్షులు
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సమగ్రశిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు.నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు కాంగ్రెస్ నాయకులు బుధవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. చాలీచాలని వేతనాలు, పనిభారంతో సతమతమవుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు రెగ్యులరైజేషన్ కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. పదిహేనేళ్లుగా వెట్టిచాకిరి చేస్తున్న వీరికి గతంలో వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రితోపాటు విద్యాశాఖ మంత్రి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, వెంటనే వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు.