డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచి త్వరితగతిన లబ్దిదారులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

 

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 30 (ప్రజాబలం) ఖమ్మం బుధవారం కలెక్టర్ మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలోని అల్లిపురం, వైఎస్సార్ నగర్ లో నిర్మిస్తున్న డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. అల్లిపురంలో 8 బ్లాకుల్లో 192 గృహాలను జి ప్లస్ 2 పద్దతిలో నిర్మాణాలకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్లాస్టరింగ్ పూర్తయి, పెయింటింగ్ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. బ్లాకుల వారిగా పనులు పూర్తిచేసి, పూర్తి అయిన బ్లాకులను వెంట వెంటనే అందజేయాలన్నారు. వైఎస్ఆర్ నగర్ లో 4 బ్లాకుల్లో జి ప్లస్ 2 పద్దతిలో 96 గృహాలు నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు. ఇట్టి గృహాల్లో పెయింటింగ్ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. డోర్ షట్టర్స్, కిటికీలు, సానిటరీ సామాగ్రి వెంటనే సమకూర్చుకోవాలన్నారు. సెప్టిక్ ట్యాoకులు, అంతర్గత సిసి రోడ్డు, డ్రైనేజీ పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వర్కర్లను పెంచాలని, అన్ని బ్లాకుల్లో పనులు చేపట్టాలని ఆయన అన్నారు. పనుల్లో రోజువారి పురోగతి ఉండాలని, అధికారులు రోజూ పనులు జరిగేట్లు పర్యవేక్షణ చేయాలన్నారు. వైఎస్సార్ నగర్ పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా పాఠశాల ఏర్పాటుకు గాను డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాల్లో ఏర్పాట్లు చేయాలన్నారు. పాఠశాల స్థాపనకు గాను అనువుగా ఏర్పాట్లు చేయాలన్నారు. రెండు చోట్ల డబల్ బెడ్ ఇండ్ల నిర్మాణాలు సెప్టెంబర్ 15 కల్లా పనులన్నీ పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేసే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి సోమశేఖర శర్మ, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, డిఇ చంద్రశేఖర్, డబల్ బెడ్ రూమ్ డిఇ టి. కృష్ణారెడ్డి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సిహెచ్. స్వామి, అధికారులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking