– ప్రపంచ ఆటిజం అవగాహనా నెల (ఏప్రిల్) సందర్భంగా రెండు సంవత్సరాల లోపు చిన్నారుల పెరుగుదలలో అభివృద్ధిపై ఉచిత స్క్రీనింగ్, కౌన్సిలింగ్
హైదరాబాద్: ఆటిజం అవగాహనా నెలను (ఏప్రిల్) పురస్కరించుకుని, హైదరాబాద్‌లోని అనన్య చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్ (అనన్య సిడిసి) రెండు సంవత్సరాల లోపు చిన్నారుల పెరుగుదలో అభివృద్ధిపై ఉచిత స్క్రీనింగ్ మరియు తల్లిదండ్రులకు, కేర్ టెకర్స్ కు కౌన్సిలింగ్ నిర్వహిస్తోంది.
ఆటిజం సోసైటీ ఆఫ్ ఏపీ & తెలంగాణ వ్యవస్థాపకురాలు, అనన్య సిడిసి డైరెక్టర్, అలాగే ఆటిజంతో జీవిస్తున్న 25 ఏళ్ల కుమారుడితో అనుభవం ఉన్న తల్లిగా మాధవి ఆదిమూలం, ఆటిజం లక్షణాలను తొందరగా గుర్తించడం ఎంత ముఖ్యమో వివరించారు. “ప్రారంభ దశలోనే స్క్రీనింగ్ మరియు జోక్యం చేసుకోవడం అన్నది పిల్లల అభివృద్ధి, జీవిత నాణ్యతకు కీలకమైనవి. గర్భదశ తొలి 1,000 రోజులు, అంటే రెండవ జన్మదినం వరకు, మానసికాభివృద్ధికి అత్యంత ముఖ్యమైన సమయం. ఈ దశలో పిల్లల ప్రవర్తనలో, వారి అభివృద్ధిలో ఏమైనా తేడాలు అనిపిస్తే వారికి సత్వరం సరైన మద్దతు, Speech therapy (స్పీచ్ థెరపి), Occupational థెరపీ (ఆక్యుపేషనల్ థెరపి) ఇవ్వడం వల్ల ఆటిజం వంటి పరిస్థితులపై గణనీయమైన ప్రభావం చూపించవచ్చు.
అనన్య సిడిసి తల్లిదండ్రులు, సంరక్షకులు, వైద్య నిపుణులు, మరియు ఉపాధ్యాయులను అభివృద్ధి దశలు మరియు ముందస్తు జోక్యపు అవసరంపై మరింత అవగాహన కలిగించడానికి పిలుపునిస్తోంది.
ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే భాగంగా, అనన్య సిడిసి తన ప్రాముఖ్యత కలిగిన ప్రోగ్రాం “న్యూరోనర్చర్” ద్వారా పిల్లల అభివృద్ధిపై బేరీజు వేసేందుకు వారికి ఉచిత స్క్రీనింగ్ మరియు తల్లితండ్రులకు కౌన్సిలింగ్ అందిస్తోంది. ఈ కార్యక్రమం తల్లిదండ్రులకు తమ పిల్లల అభివృద్ధికి ముందస్తుగా చర్యలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
నా 26 ఏళ్ల కుమారుడు వరుణ్‌కు తల్లిగాను, అనన్య సిడిసి స్థాపకురాలిగాను, ఆటిజం లక్షణాలను ముందస్తుగా తెలుసుకోవడం మరియు తగిన సమయానికి అందించే మద్దతు ఎంత ప్రభావశీలమో నేను ప్రత్యక్షంగా అనుభవించాను అని మాధవి అన్నారు. ఈ ఆటిజం అవగాహనా నెలలో, పిల్లల అభివృద్ధి స్క్రీనింగ్‌పై అవగాహన పెంచడానికి, అపోహలను తొలగించడానికి మరియు తల్లిదండ్రులు తొందరగా మార్గనిర్దేశం పొందేలా ప్రోత్సహించడానికి మనం కృషి చేద్దాం. సమయానికి జోక్యం తీసుకోవడం ద్వారా పిల్లలు విజయవంతంగా ఎదగగలరు అని ఆమె తెలిపారు.
ఉచిత అభివృద్ధి స్క్రీనింగ్ & అపాయింట్‌మెంట్ వివరాల కోసం, దయచేసి సంప్రదించండి:
+91 9848513192; contact@asap.org.in; www.asap.org.in