పత్తి రైతు పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటు

 

-సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రేగుంటచంద్రశేఖర్

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్, మార్చి 6:

దేశానికి వెన్నెముకైన రైతు పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా నేడు రైతు కన్నీరు పెట్టాల్సిన దుస్థితి నెలకొంటుందని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రేగుంట చంద్రశేఖర్ అన్నారు. గురువారం చెన్నూరు పట్టణ కేంద్రంలోని తాపీ మేస్త్రి సంఘ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఉమ్మడి జిల్లాలో పత్తి రైతులను అధికారుల అండదండలతో దళారులు విపరీతంగా దోచుకుంటున్నారని, పండించిన పత్తిని అమ్ముకోవడానికి కూడా చెన్నూరు నియోజకవర్గంలో రైతులు కన్నీళ్లు పెడుతున్నారని, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆయన కుమారుడు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పత్తి రైతుల ఆవేదనను పట్టించుకోకపోవడం సిగ్గుచేటని, రైతుల బాగోగులు చూడాల్సిన కనీస బాధ్యత స్థానిక నాయకులకు లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. పత్తి రైతుల ఆవేదనను పట్టించుకోని నాయకులు, అధికారుల తీరును ఉపేక్షించేది లేదని, పత్తి రైతులకు ఎర్రజెండా అండగా నిలిచి దళారుల దోపిడీ నుండి పత్తి రైతులను కాపాడే దిశగా ఎర్రజెండా అండగా రైతుల పక్షాన పోరాడతామని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. చెన్నూరు మండల కార్యదర్శి నెన్నెల సమ్మయ్య, పట్టణ కార్యదర్శి సుంకరి చందు, నాయకులు సూత్రం నారాయణ, దుర్గం శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking