స్టేట్ బ్యూరో ప్రజాబలం ప్రతినిధి:తెలంగాణా రాష్ట్రంలో టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యువేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగి పోవడంతో శాసనసభ్యుల ఎమ్మెల్సీ స్థానాలకు నోటీఫికేషన్ వెలువడడంతో అన్ని పార్టీలలో ఆశావాదులకు ఆశలు కల్గాయి.5 స్థానాలకు పోటీ ఉండడటంతో తెలంగాణా అసెంబ్లీ బలబలాలను బట్టీ 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం టీఆర్‌ఎస్ పార్టీకి దక్కే అవకాశం ఉన్నది.ఇటీవలే నూతనంగా తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్‌గా నియమితులైన మీనాక్షీనటరాజన్ సమీక్షా సమావేశాలు నిర్వహించడం పార్టీలు పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు లభిస్తాయని పార్టీని వీడకుండా ఉన్న సీనీయారిటీ నాయకులకు ప్రాధాన్యత లబిస్తుందని అని అన్నారు.తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పోక్స్‌పర్సన్ రాంశెట్టీ నరేందర్ 38 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అధికారంలో లేకున్నా కాంగ్రెస్ పార్టీని వీడకుండా కాంగ్రెస్ పార్టీని అంటగట్టుకుని ఉన్నారు.ఇపుడు జరగబోయే శాసనసభ్యుల ఎమ్మెల్సీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నిన్తున్నారు.పార్టీ పెద్దలకు తన కోసం తాను చేసిన సేవలను గుర్తించాలని వివరిస్తున్నరు.కాంగ్రెస్ పార్టీలొ 38 సంవత్సరాలలో తాను చేసిన పనులు పదవులు వివరిస్తున్నారు. ఆ వివరాలు ఆంద్రప్రదేశ్ జోనల్ డైరెక్టర్ ఆఫ్ సివిల్ సప్లై 1993. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 1985 నుంచి 1987 వరకు ,హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా 1987 `1994 వరకు , 1994లో టెలిఫోన్ అడ్వైజరీ బోర్ట్ మెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో,వైజాగ్ , శ్రీకాకుళం ,విజయనగరం,వరంగల్ మరియు చిత్తురు జిల్లాల యూత్ కాంగ్రెస్ జిల్లాల ఇంఛార్జ్‌గా కాంగ్రెస్ పార్గీకి సేవలందించారు.1987 నుండి 2000 వరకు కాంగ్రెస్ పార్టీ కొరకు చేసిన పోరాటాలలో తన పైన నమోదు అయిన 9 కేసులకు గాను న్యాయస్థానాల చుట్టూ న్యాయం కోసం పోరాడినాడు.గత 10 సంవత్సరాలుగా బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా 900 వీడీయోలను విడుదల చేసినారు.గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన రాంశెట్టీ నరేందర్ వయసు 60 సంవత్సరాలు ఇంటర్మీడీయేట్ వరకు చదివినారు. బీసీ డీ మున్నూరు కాపు కులం గోషామహల్ నియోజక వర్గం నివాసం.ఎమ్మెల్సీ రేసులో ఉన్న రాంశెట్టీ నరేందర్‌కు పార్టీలో క్రమశిక్షణ గల నాయకునిగా పేరున్న తన సామాజిక వర్గమయిన మున్నూరు కాపు కులసంఘం మద్దతు తెలుపుతూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కుల సంఘం తరుపున రాంశెట్టీ నరేందర్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని లేఖ రాశారు.