ముఖ్య అతిథులుగా హాజరైన డి ఎం హెచ్ ఓ డాక్టర్ మాలతి
ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కంభంపాటి నారాయణరావు డాక్టర్ జగదీష్ బాబు
హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్యామ్ కుమార్ కు పలువురి శుభాకాంక్షలు
ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 9 (ప్రజాబలం) ఖమ్మం నగరంలో వైరా రోడ్డు లోని శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మాలతి మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ జి శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో అధునాతన వైద్య పరికరాలతో పూర్తి చేసుకున్న హాస్పిటల్ భవనాన్ని పలువురు ప్రముఖ వైద్యులతో కలిసి డీఎంహెచ్‌ఓ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డా ఎం హెచ్ ఓ డాక్టర్ మాలతి మాట్లాడుతూ… డాక్టర్ జి శ్యామ్ కుమార్ తను వైద్య రంగంలో మరింతగా రాణించాలని అభిలషించారు. దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల వైద్యశాలగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఆధునిక పద్ధతిలో అధునాతన పరికరాలతో నిర్మించుకున్న హాస్పిటల్ అందరికీ చేరువ కావాలని అమె కోరారు తొలుత హాస్పిటల్ ప్రధాన భవనాన్ని డిఎంహెచ్వో ప్రారంభించగా ఫార్మసీని ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కంభంపాటి నారాయణరావు, ల్యాబ్ ను డాక్టర్ కే జగదీష్ బాబు, ఐసీయూను డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్, క్యాజువాలిటీని డాక్టర్ హనుమాన్, కన్సల్ టేషన్ రూమ్ ను మాజీ ఎంపీపీ లక్ష్మణ్ నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తొలుత ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేశారు. వేద పండితులు ఆశీర్వచనంతో డాక్టర్ జి శ్యామ్ కుమార్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు ఆర్క హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ రవికుమార్, ప్రముఖ క్యాన్సర్ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ వీరపనేని ప్రదీప్, డాక్టర్ మోహన్, డాక్టర్ బొల్లి కొండ శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు, డాక్టర్ గోపగాని సురేందర్, డాక్టర్ బావ్ సింగ్, కార్పొరేటర్లు పాకాల పార్టీ విజయనిర్మల శేషగిరి, మక్బూల్, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు, సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా అధ్యక్షులు కిషన్ నాయక్, ఆర్ఎంపీల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు, శ్రీ బాలాజీ మల్టీస్పెషల్టి హాస్పటల్ సిబ్బంది డాక్టర్ శివారెడ్డి సురేష్ స్వర్ణలత వీరన్న భావన రమణ లలిత సంతోషి వనిత నాగరాజు స్వరూప ఖమ్మం జిల్లాకు చెందిన వివిధ పత్రికలు, చానళ్ల జర్నలిస్టులు పాల్గొన్నారు
