ప్రజలు క్షేమంగా ఉండాలి ఉగాది వేడుకల్లో ఎంపీ నామ నాగేశ్వరరావు

 

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 09 (ప్రజాబలం) ఖమ్మం స్వర్ణ భారతి కల్యాణ మండపంలో కమ్మ మహాజన సంఘం నేతృత్వంలో మంగళవారం కన్నుల పండువగా ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి ఎంపీ నామ నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొని,ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు, రైతులకు, బడుగు బలహీన వర్గాలకు, పేదలందరికీ శ్రీ క్రోధ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటికే కరువుతో, అనేక సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, రానున్న రోజుల్లో నూతన వ్యవసాయ సీజన్ మంచిగా, ఆశా జనకంగా ఉండి, పుష్కలంగా వర్గాలతో పంటలు పండి, సంతోషంగా జీవించాలని నామ నాగేశ్వరరావు ఆకాంక్షించారు. అందరూ సుఖ సంతోషాలు తో ఆనందంగా కుటుంబాలతో జీవించాలని, అనుకున్న కోరికలు, లక్ష్యాలు సిద్దించి,భవిష్యత్ వైపు ముందుకు సాగాలని అన్నారు.పండుగను అందరూ కుటుంబాలతో, స్నేహితులతో కలిసి వైభవంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు ఎంపీ నామ నాగేశ్వరరావు ను శాలువా తో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, స్థానిక ప్రముఖులు, కమ్మ సంఘం నాయకులు ఎర్నేని రామారావు,స్థానిక ప్రముఖులు నల్లమల వెంకటేశ్వరరావు , కాటంనేని రమేష్, మోరంపూడి ప్రసాద్, తన్నీరు రవి తదితరులు తో పాటు నామ సేవా సమితి నుంచి తాళ్లూరి హరీష్, రాజేష్, చీకటి రాంబాబు, కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking