బీఆర్ఎస్ పార్టీ హయాంలో అవినీతి అక్రమాలు విపరీతంగా జరిగాయని ఆరోపించారు

పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 19 : పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ అధికార ప్రతినిధి చీటి ఉమేష్ తెలిపారు.సోమవారం మంచిర్యాల వచ్చిన సందర్భంగా ఆయన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాస గృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేస్తారని అన్నారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామని తెలిపారు.బీఆర్ఎస్ హయాంలో అవినీతి అక్రమాలు విపరీతంగా జరిగాయని ఆరోపించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగి నాణ్యత లోపంతో నిర్మాణం జరపడం వల్లనే మెడిగడ్డ కుంగిపోవడం,అన్నారంలో బుంగపడిందని విమర్శించారు. అసెంబ్లీ లో నిస్సుగ్గుగా చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటు కాంగ్రెస్ పై ఎదురుదాడి చేస్తోందని మండిమడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎంత నాణ్యత, పటిష్టంగా ఉందొ చూడాలని హితవుపలికారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking