తూప్రాన్ లో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు.

చత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు .

మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్:-

మెదక్ జిల్లా తూప్రాన్ లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తూప్రాన్ మండల ఆర్ఎంపి , పి.ఎం.పి ల అసోసియేషన్ అధ్యక్షుడు అప్సర్, మెదక్ జిల్లా నాయకులు, చందాయ్ పేట్ భాగ్యరాజు ,
బిఆర్ఎస్ సీనియర్ ఉద్యమ నాయకులు మన్నే శ్రీనివాస్ రావు, నాయకులు కుమ్మరి రమేష్ , నర్సాపూర్ చౌరస్తా లోని శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.శివాజీ దేశానికీ చేసిన సేవలను కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనార్టీ నాయకులు డాక్టర్ అప్సర్, నాయకులు భాగ్యరాజ్, మెదక్ జిల్లా బిసి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు చిన్నలింగ్ మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశానికి హిందూ సామ్రాజ్యానికి మహారాజు చత్రపతి శివాజీ వీరుడు ధీరుడు ధైర్యవంతుడు అని ఈ సందర్భంగా యువత చత్రపతి శివాజీ ని ఆదర్శంగా తీసుకోవాలని భారతదేశానికి మరియు హిందువుల ఆరాధ్య దైవం చత్రపతి శివాజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో నాయకులు మన్నె శ్రీనివాసరావు, కుమ్మరి రమేష్, మెదక్ జిల్లా బి సి సంఘము ఉపాధ్యక్షులు చిన్నలింగ్ మల్లిఖార్జున్ గౌడ్, లంబాడి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు రాథోడ్ జయపాల్, బాయికాడి ఆంజనేయులు, 12వ వార్డు అధ్యక్షులు గంగాధర్ వెంకటేష్, యాదవ్ మహా సభ నాయకులు బండ నాగరాజు యాదవ్, బోల్లబోయిన మహేష్ యాదవ్, శ్రీనివాస్ వెంకటొల్ల శివకృష్ణ గౌడ్, బందెల నరేష్, గడ్డం వెంకటేష్, గొల్లపల్లి నరేష్ రెడ్డి, శ్రీనివాసరావు, స్వామితదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking