మణికొండ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానం నెగ్గెనా వీగేనా !

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 20 ఫిబ్రవరి 2024:
కాంగ్రెస్ పార్టీకి చెందిన కస్తూరి నరేందర్ చైర్మన్ గా, బీ.జే.పీ పార్టీకి చెందిన కే.నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్గా దేశ రాజకీయ చరిత్ర లోనె బద్ద శత్రువు లైన పార్టీల ఇద్దరు నాయకులు కనివిని ఎరుగని విధంగా విడ్డూరంగా మణికొండ కౌన్సిల్ 20 వార్డులు గా ఏర్పడిన గత 4 సంవత్సరాలుగా అధికారాన్ని కొన సాగిస్తుండగా అన్ని పార్టీలకు చెందిన 10 మంది కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా ఏకైక లక్షంతో చైర్మన్ కు వ్యతి రేకంగా అతను చేసే ఒంటెద్దు పోకడ దూకుడు లకు కళ్ళెం వేసేలా పట్టుదలతో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం, అందుకు గాను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమోదించి ఈ నెల 22 న ముహూర్తం ఖరారు చేయడం జగమెరిగిన సత్యం, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కుటుంబానికి చెందిన కస్తూరి నరేందర్ అంచలంచెలుగా ఎదుగుతూ రాజేంద్ర నగర్ అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజకీయ అనుభవంతో తనదైన శైలిలో కౌన్సిల్ అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవడానికి ఎత్తుకు పై ఎత్తుగా తనతో సహా 8 మంది కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాకుండా అందులో భాగంగా గోవా పర్యటనకు కలసి కట్టుగా వెళ్ళినారని తత్ పర్యవసానంగా కనీసం 13 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంకు హాజరు కావలసి ఉండగా అట్టి సంఖ్య కౌన్సిలర్లు హాజరు కాకుండా చేసి, ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఏకంగా విచ్ఛిన్నం చేయడానికి ఏర్పాట్లు చేసినారని విశ్వసనీయ సమాచారం, ఇందుకు ప్రత్యర్థి వర్గం వారు తమ జట్టు సంఖ్య 10 మంది కౌన్సిలర్లు తగ్గకుండా ఉండేందుకు నానా యాతనాలు పడుతూ రోజు కొక స్థలంలో విడిది ఏర్పాటు జేసుకుంటు తటస్థంగా ఉన్న ఇద్దరిని సర్దుబాటు చేసుకొని, చైర్మన్ తో పాటు విడిదిలో ఉన్న వారిలో ఒక్కరి నైన తమ వైపు లాగడానికి శత విధాల ప్రయత్నాలను ముమ్మరం గావిస్తు ఊహించని పరిణామాలు చోటు చేసుకునే విధంగా అవిశ్వాసాన్ని నెగ్గించుకునే ప్రయత్నములో ఉన్నారని సమాచారం.

Leave A Reply

Your email address will not be published.

Breaking