కొక్కిరాల రాఘుపతి రావు టాస్టు అధ్వర్యంలో మేడారం జాతర వెళ్ళే స్వెషల్ బస్సుల డ్రైవర్లకు,కండక్టర్లకు భోజనం పంపిణీ

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 20 : కొక్కిరాల రఘపతి రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ ఆధ్వర్యంలో సమ్మక్క సారక్క మేడారం జాతర సందర్బంగా మంచిర్యాల నుండి మేడారం జాతర వెళ్లే స్పెషల్ బస్సుల డ్రైవర్లకు కండక్టర్లకు ఈ మంగళవారం రోజు నుండి మూడు రోజుల పాటు భోజన సదుపాయం ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మంచిర్యాల బస్ డిపోలో బస్సుల డ్రైవర్లకు కండక్టర్లకు భోజనం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్,బ్లాక్ అధ్యక్షుడు పూదరి తిరుపతి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking