ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్
ప్రజాబలం బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఫిబ్రవరి 20 : ప్రతి రైతు విధిగా మట్టి పరీక్ష చేయించుకోవాలి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట కుమార్ తెలిపారు.జాతీయ మట్టి ఆరోగ్య కార్డుల దినోత్సవం పురస్కరించుకొని బెల్లంపల్లి మండలంలోని పాత బెల్లంపల్లి గ్రామంలో జగిత్యాల వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఎమ్మెల్యే ద్వారా రైతులకు మట్టి ఆరోగ్య కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శివకృష్ణ, వ్యవసాయ అధికారి వంధన పాల్గొన్నారు.