ప్రజబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూన్ 21:
తార్నాక నారాయణ పాఠశాలలో అంతర్జాతీయ
యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో డిజిఏం. గోపాల్ రెడ్డి, ఏజీఎం బాల పరమేశ్వర్ పాల్గొని నేటి కాలంలో విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వల్ల
పిల్లల్లో జ్ఞాపక శక్తి మానసిక ఉల్లాసానికి ఏకాగ్రత
పెరగడానికి యోగా ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు.
ఏకాగ్రత పెరిగే కొద్ది జ్ఞానాన్ని ఆర్జించవచ్చన్నారు. ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం అది యోగా తోనే సాధ్యమవుతుందని సూచించారు. విద్యార్థులచే యోగాసనాలు వేయించి యోగా ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పర్వీన్, పి.ఇ.టి నరేష్,ఏ.ఓ.మహేందర్,
ఉపాధ్యాయులు పాల్గొన్నారు