జగిత్యాల బిజెపి అసెంబ్లీ అభ్యర్థిగా తిరుపతి దరఖాస్తు

 

జగిత్యాల, సెప్టెంబర్ 4: జగిత్యాల అసెంబ్లీ స్థానంలో బిజెపి అభ్యర్థిగా తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని పడాల తిరుపతి హైద్రాబాద్ లోని బిజెపి కార్యాలయంలో దరఖాస్తు చేశారు. సోమవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే టికెట్ ను ఆశిస్తూ బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పడాల తిరుపతి తన అప్లికేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ బీజేపీలో చేరిన నాటి నుంచి ప్రజల మధ్యలో ఉంటూ బిజెపి లక్ష్యాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలకు చేరువలో ఉన్నానన్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ తన దరఖాస్తును పరిశీలించి పోటీకి అవకాశం ఇస్తే విజయం సాధించేందుకు అందరి సహకారంతో కృషిచేస్తానని తిరుపతి పేర్కొన్నారు. ఆయన వెంట రాయికల్, బీర్పూర్ మండల అద్యక్షులు అన్నవేణి వేణు, మాడ జనార్దన్ తోపాటు పలువురు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking