ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి (ప్రజాబలం)సెప్టెంబర్ 4:
ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఈ సోమవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో లా ఆఫీసర్ చంద్రావతి ,తో కలిసి ప్రజల వద్ద నుండి135 ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్బంగా రెవెన్యూ అధికారి హరిప్రియ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే అర్జీలను అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీదారులకు స్పష్టమైన సమాచారం అందించాలని, అధికారుల కు సూచించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking