ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 20:
మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న జామి ప్రసాదరావు హిందీ బోధన ఉపాధ్యాయులుగా సేవలు అందిస్తూనే హిందీలో రచించబడిన వందలాది రచనలకు గుర్తింపుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ లకావత్ సిల్మా నాయక్ ఉపాధ్యాయ వృత్తితో పాటు సేవ్ ఎర్త్ ఫౌండేషన్ ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తూ పర్యావరణ పరిరక్షణ జల సంరక్షణ సహజ వనరుల సంరక్షణ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంతున్న ఆయన చేస్తున్న కృషిని గుర్తించి సమాజ సేవలకు గుర్తింపుగా స్వదేశీ భూషణ్ అవార్డు 2025 కు ఎంపిక కావడం హర్షణీయం. ఈ సందర్భంగా వారికి ఉత్తరప్రదేశ్ లోని పవిత్ర భూక్షేత్ర ప్రాంతం అయోధ్యలో ఏప్రిల్ ఒకటి నుండి 5వ తారీఖు వరకు జరిగే అంతర్జాతీయ సదస్సులో ఈ స్వదేశీ భూషణ్ 2025 అంతర్జాతీయ అవార్డును తెలంగాణ రాష్ట్రానికి చెందిన జామి ప్రసాదరావు కు, డాక్టర్ లకావత్ సిల్మా నాయక్ కు, డాక్టర్ టి సురేందర్ కు అందజేయనున్నట్లు స్వదేశీ సంస్థాన్ ఇండియా వ్యవస్థాపకులు ఎస్ బి సాగర్ ప్రజాపతి ఒక ప్రకటనలో తెలియజేశారు.