ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 20:
మందమర్రి పట్టణంలో ఎమ్మెల్యే కాలనీ ప్రాంతానికి చెందిన అల్లకొండ కుమార్ అనారోగ్యంతో ఇటీవల మరణించగా వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో ఉందని తెలుసుకొని ఆ కుటుంబానికి గురువారం వారి ఇంటికి వెళ్లి ఆదరించు సేవా సమితి ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం నిత్యవసర సరుకులు వారి కుటుంబానికి అందజేసారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడు కాంపాటి మురళి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో ఇలాంటి వారికి ఎంతో కొంత ఆర్థిక సహయం చేయగలరని వారు కోరారు. ఇప్పటివరకు దాతల సహకారంతో ఎంతోమంది నిరుపేదలకు
విద్యార్థులకు అనారోగ్యంతో బాధపడే వారికి ఎండాకాలంలో చలివేంద్రం మరియు అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆదరించు సేవా సమితి కి సహకరించిన ప్రతి ఒక్కరికి మేము ఋణపడి ఉంటామని వారికి సకల ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాము.
ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు కాంపాటి మురళి, వరద రాబర్ట్, శ్రీపతి రమేష్, జోసెఫ్, పాల్గొన్నారు.