పదవ తరగతి పరీక్షలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి

 

ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసినం

మండల విద్యాధికారి బన్నాజీ

వేములవాడ మార్చి – 20 (ప్రజాబలం న్యూస్ )

వేములవాడ పట్టణంలోని శుక్రవారం నుండి జరగనున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మండల విద్యాధికారి బన్నాజీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి నుండి జరగబోయే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హంసిని హై స్కూల్, గౌతమ్ మోడల్ స్కూల్, కిడ్స్ కాన్వెంట్ హై స్కూల్, శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని మొత్తం మండల కేంద్రాల్లో 1243 విద్యార్థిని విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని ఇట్టి పరీక్షలు ఈనెల 21 తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి 12.30 నిమిషాల వరకు జరుగుతుందని. విద్యార్థులకు 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఉంటుందని అనగా ఆఖరి సమయం 9.35 నిమిషాలకు తప్పకుండా హాజరు కావాలని లేని పక్షంలో పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడదని తెలిపారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోని హాల్ టికెట్,బ్లూ బ్లాక్ పెన్, లాంగ్ స్కేల్ తమ వెంట తెచ్చుకోవాలని నిర్ణీత సమయం పాటించాలని అన్నారు. అలాగే ఆరు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసామని విద్యార్థులకు త్రాగునీరు వసతుల యొక్క సదుపాయాలు ఎలా ఉన్నాయని తనిఖీ చేశామని అలాగే పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు లో ఉంటుందని విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు వ్రాయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాలలో చీఫ్ సూపర్డెంట్ బుర సదానందం, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ లక్ష్మణ్ ,పట్టణ సిఆర్పి ఆకుల శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking