ఛార్మీనార్ ప్రజాబలం ప్రతినిధి: భారతదేశంలోని ప్రముఖ ప్రఖ్యాతి చెందిన ట్రావెల్ సంస్థ అయిన సదరన్ ట్రావెల్స్, 2025 మహా కుంభ్మేళాలో భక్తుల అఖండ భక్తికి ప్రతిస్పందనగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కృతజ్ఞతా సూచకంగా, సదరన్ ట్రావెల్స్ భక్తులందరికీ మరియు ప్రయాణికులందరికీ ఉచితంగా “త్రివేణి సంగమ జలం” అందిస్తునారు.
గంగా, యమునా మరియు సరస్వతి నదుల పవిత్ర సంగమం వద్ద జరిగిన మహా కుంభ్మేళాకి దేశవ్యాప్తంగా 66 కోట్ల మంది యాత్రికులు అపూర్వంగా హాజరయ్యారు. ఈ భక్తుల ఆధ్యాత్మిక అనుభవాలను మెరుగుపరచడానికి, సదరన్ ట్రావెల్స్ ప్రతి ఇంటికి పవిత్ర త్రివేణి సంగమం యొక్క ఆశీర్వాదాలను తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
“ఈ పవిత్ర కార్యక్రమంలో సదరన్ ట్రావెల్స్ పై భక్తులు చూపిన అపారమైన ప్రేమ మరియు నమ్మకం మాకు చాలా గర్వకారణం. మహా కుంభ్మేళాకు విచ్చేసిన అనేక మంది యాత్రికులకు సేవ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మహా కుంభ్మేళా అనేది కోట్లాది మందికి జీవితంలో ఒకసారి జరిగే అనుభవం మరియు దాని ఆధ్యాత్మిక సారాన్ని అందరికీ అందించాలని మేము కోరుకుంటున్నాము. అందరికీ త్రివేణి సంగమ జలాన్ని అందించడం ద్వారా, ఈ గౌరవనీయమైన కార్యక్రమం యొక్క పవిత్రత మరియు దైవిక ఆశీర్వాదాలను పంచుకోవాలని మేము కొరుకుంటున్నాము.”
సదరన్ ట్రావెల్స్ 2025 మహా కుంభ్మేళాను ఆదర్శప్రాయమైన ఏర్పాట్లు మరియు సజావుగా అమలు చేసినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. యాత్రికుల సౌకర్యం మరియు భద్రతను నిర్ధారించడంలో రాష్ట్ర పరిపాలన యొక్క అంకితభావం ప్రశంసనీయం, ఈ గొప్ప కార్యక్రమాన్ని సందర్శకులందరికీ ఆధ్యాత్మికంగా సుసంపన్నం చేసి చక్కగా నిర్వహించారు.
ఈ కార్యక్రమం ఇప్పటికే అనేక ప్రపంచ రికార్డులను సృష్టించింది వాటిలో ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక స్నాన కార్యక్రమం, సుదీర్ఘమైన నిరంతర ప్రార్థన, సమర్పణ మరియు అతిపెద్ద కమ్యూనిటీ భోజన సేవతో సహా పలు ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. సదరన్ ట్రావెల్స్ ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో భాగమైనందుకు గర్వంగా ఉంది, దాని విజయానికి మరియు అంతర్జాతీయ గుర్తింపుకు దోహదపడింది.
పవిత్రమైన “త్రివేణి సంగమ జలం”ను స్వీకరించాలనుకునే భక్తులు మరియు ప్రయాణికులు సదరన్ ట్రావెల్స్ వెబ్సైట్ (www.southerntravels.com) ద్వారా చేరుకోవచ్చు లేదా దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ సదరన్ ట్రావెల్స్ బ్రాంచి కార్యాలయాలను సందర్శించగలరు. PH No: 98480 23236