కోకపేట పెరిక భవన్ నిర్మాణం కోసం సుద్దపల్లి సుధాకర్ ఐదు లక్షల విరాళం

 

మొదటి విడతగా రెండు లక్షల అందచేత,ఇప్పుడు రెండో విడతగా మరో లక్ష రూపాయల చెక్

మొత్తంగా మూడు లక్షల విరాళం అందించిన సుద్ధపల్లి సుధాకర్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 20 : శ్రీకల్ప సెల్యులోస్ ప్రొడక్ట్స్ అధినేత,హైదరాబాదులో స్థిరపడిన ఒంగోలు వాసి సుద్ధపల్లి సుధాకర్ కోకపేట తెలంగాణ పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.ఇందులో మొదటి విడతగా రెండు లక్షల రూపాయలను గతంలో పెరిక సంఘం నాయకులకు అందించగా,రెండో విడత మరో లక్ష రూపాయలు గురువారం భవన నిర్మాణ కమిటీ చైర్మన్ ఘటిక విజయ్ కుమార్ కు అందించారు.కోకాపేటలో పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం కుల సంఘం నాయకులు, భవన నిర్మాణ కమిటీ సభ్యులు పడుతున్న కృషిని అభినందించారు.తన వంతుగా విరాళం ఇవ్వడంతో పాటు తన మిత్రులతో కూడా మరిన్ని విరాళాలు ఇప్పిస్తానని సుధాకర్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి దొంగరి మనోహర్,కోపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు అందె శ్రీనివాస్, విద్యార్థి వసతి గృహం ప్రధాన కార్యదర్శి అచ్చ రఘు కుమార్,రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిని పరమేష్ తదితరులు పాల్గొన్నారు.సుధాకర్ కి పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దా లింగయ్య,ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్ వారి కార్యవర్గాలు కృతజ్ఞతలు తెలిపారు.సుధాకర్ తో విరాళం ఇప్పించే విషయంలో చొరవ చూపిన పెరిక కుల పరపతి సంఘం అధ్యక్షులు అందే శ్రీనివాస్ కి సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking