మాణిక్ రావ్ ఠాక్రేతో జానారెడ్డి, పొంగులేటి భేటి

 

ఖమ్మం ప్రతినిధి జూలై 31 (ప్రజాబలం) హైదరాబాద్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రేతో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం భేటి అయ్యారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని జానా రెడ్డి నివాసంలో ఈ భేటి జరిగింది. ప్రజా వ్యతిరేక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి అవలంభిచాల్సిన విధివిధానాలు ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చినట్లు పొంగులేటి తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుల సలహాలు, సూచనలతో పార్టీ అభివృద్ధికి తనవంతు సేవలను అందిస్తానని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking