వరదల వల్ల నష్టపోయిన రైతులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి బిజెపి నేత,ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ డిమాండ్
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్,జులై 31ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడ్డ వరదలతో సర్వం కోల్పోయి,నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే,తెలంగాణ రాష్ట్ర బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు, సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాసంలో బిజెపి నాయకులతో కలిసి మీడియా సమావేశం లో పాల్గొన్నారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని గత సంవత్సర వరదల వల్ల ఏర్పడ్డ పంట నష్టపరిహారాన్ని ఇప్పటికీ ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించి రైతుల బాగు కోసం తీసుకువచ్చిన ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రాల్లో అమలు చేయడం లేదని దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి రైతాంగ వ్యవసాయం గురవుతుందని పేర్కొన్నారు,రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన ఫసల్ బీమా యోజన వాట కట్టకపోవడం వల్ల రైతులు ఆర్థికంగా చితికి పోతున్నారని పేర్కొన్నారు,వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజానీకానికి సహాయం అందించడంలో అధికార యంత్రాంగం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజలకు కావలసిన నిత్యవసరాలు సరుకులను పలు స్వచ్ఛంద సంస్థలు,దాతలు ముందుకు వచ్చి సమకూరుస్తున్నారు, తప్ప ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు,వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు ఉత్త చేతితో పర్యటిస్తున్నారు తప్ప వారికి సహాయ సహకారాలు అందించడం లేదని ఆరోపించారు,వరదల ద్వారా ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి తక్షణ సాయం కింద సరుకుల కొరకు 25000 ఇవ్వాలని డిమాండ్ చేశారు,వరదల ద్వారా సర్వం కోల్పోయిన రైతులను ప్రజానీకాన్ని ఆదుకొనట్లయితే భారతీయ జనతా పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో వీరితో పాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు ఏలెటి మహేశ్వర్ రెడ్డి,యెండల లక్ష్మీనారాయణ,పార్లమెంట్ ప్రభారి అల్జాపూర్ శ్రీనివాస్, పార్లమెంటు ఇంచార్జ్ అయ్యన్న గారి భూమయ్య,బిజెపి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రమాదేవి, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి.దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు రాచకొండ సాగర్