మహేష్ కుమార్ గౌడ్.. టీపీసీసీ అధ్యక్షులు..
నాంపల్లి గాంధీభవన్ ప్రజాబలం ప్రతినిధి: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌అధ్యక్షతన ఈ రోజు జూమ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. జిల్లా ఇంచార్జ్ లు మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతోపాటు డీసీసీ లు.. జిల్లా ఇంచార్జ్ లు పాల్గొన్నారు..
మహేష్ కుమార్ గౌడ్.. టీపీసీసీ అధ్యక్షులు..
గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీలు వెంటనే వేయాలి..
కాంగ్రెస్ పార్టీ ఆస్తుల వివరాలు వెంటనే పంపాలి..
వరదలల్లో ప్రజలకు అండగా ఉండాలి…
జిల్లాల్లోని గ్రామ, మండల, జిల్లా కమిటీలను ఈ నెలాఖరు లోగా పూర్తి చేసి పంపాలి..
24 నుంచి రెండో విడత జనహిత పాదయాత్ర ప్రారంభం అవుతుంది.
పాదయాత్ర లో పెద్దఎత్తున ప్రజలు పాల్గొనేలా ప్రణాళికలు చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీస్కెళ్లాలి..
రాహుల్ గాంధీ గారు చేపట్టిన బీజేపీ ఈసీ అక్రమాలపై ఓట్ చోరీ అంశాన్ని ప్రజల్లో బాగా ప్రచారం చేపట్టాలి.
రాష్ట్రంలో తీవ్రమైన వర్షాలు వరద పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రజలకు కాంగ్రెస్ క్యాడర్ అందుబాటులో ఉండి వారికి సహాయ సహకారాలు అందించి.. భరోసా కల్పించాలి.
ఓట్ చోర్ .. గద్దె చోడ్
ఓట్ల దొంగలు గద్దె దిగండి. .
ఉద్యమం…ఏఐసీసీ పిలుపు..
మూడు దశలలో ఉద్యమం…
ఆగస్టు 14న రాత్రి 8 గంటలకు దేశ వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో మాస్ క్యాండిల్ ర్యాలీ లు… ఈ ప్రదర్శన లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, డీసీసీ కార్యవర్గం, ఎమ్మెల్సీలు, అనుబంధ సంఘాల నాయకులు, బ్లాక్ మరియు మండల అధ్యక్షులు అన్ని విభాగాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలి.
ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7వరకు భారీ రాష్ట్ర స్థాయి ప్రదర్శనలు..రాష్ట్ర స్థాయి లో రాష్ట్ర రాజధాని మరియు ప్రధాన నగరాలలో ప్రదర్శన చేపట్టాలి. బీజేపీ ఈసీ కుమ్మక్కు పైన నాయకులు ప్రసంగించాలి. భారీ జన సమీకరణ చేపట్టాలి.
అన్ని విభాగాల నాయకులు సీనియర్ నాయకులు పాల్గొనాలి. పాదయాత్రలు, వాహన ప్రదర్శనలు చేపట్టాలి. ప్రజలను భాగస్వాములను చేసి బీజేపీ ఓట్ చోరీలపై ప్రసంగాలు చేయాలి..
సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు జాతీయ స్థాయి లో ఉద్యమం.. నెల రోజుల పాటు గడప గడప కు తిరిగి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టాలి.
ఓట్ల చోరీకి వ్యతిరేకంగా 5 కోట్ల సంతకాల సేకరణ చేయాలి. నాయకులు రాష్ట్రమంతటా తిరిగి సంతకాల సేకరణ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొని విజయవంతం చేయాలి…
Next Post