మున్నేరు వరద బాధితుల సహాయార్థం కోసం మంత్రి తుమ్మలకు జానకిరామ్ 1లక్ష చెక్కు అందజేత కాంగ్రెస్ కార్యకర్త గుత్తా జానకిరామ్ ను అభినందించిన మంత్రి తుమ్మల

ఖమ్మం ప్రతినిది సెప్టెంబర్ 26 (ప్రజాబలం) ఖమ్మం మున్నేరు వరద బాధితుల కోసం కాంగ్రెస్ కార్యకర్త జానకిరామ్ ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో 1లక్ష చెక్కును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అందజేశారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అనేకమంది దాతలు ముందుకు వచ్చి బాధితులకు ఆర్థికంగా, నిత్యావసర వస్తువుల రూపంలో అందిస్తూ వస్తున్నారని, అందులో భాగంగానే మనవీయకోణంతో ఒక సాధారణ కార్యకర్త 1లక్ష రూపాయలు వితరణ చేయడం ప్రశంషించదగ్గ విషయమని కార్యకర్త జానకిరామ్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రత్యేకంగాఅభినందించారుఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మహమ్మద్ ఆశ్రీఫ్, కార్పోరేటర్ పల్లెబోయిన బారతి, చంద్రం నాయకులు మోత్కూరి శ్రీనివాస్, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking