విశ్వ కార్తీక్ ను అభినందిస్తున్న పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య

రాష్ట్రస్థాయి స్కేటింగ్ కు స్మార్ట్ కిడ్జ్ విద్యార్థి ఎంపిక

-విశ్వ కార్తీక్ ను అభినందించిన స్కూల్ కరెస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య.

ఖమ్మం ప్రతినిది సెప్టెంబర్ 26 (ప్రజాబలం) ఖమ్మం స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో మూడవ తరగతి విద్యార్థి విశ్వ కార్తిక్ రాష్ట్రస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. వచ్చే నెలలో 3,4 తేదీలలో భువనగిరిలో జరిగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి రోలర్ స్కేటింగ్ పోటీలకు జిల్లా నుంచి ఎంపికయ్యాడు.ఈ నెల 22 వ తేదీన సర్దార్ పటేల్ స్టేడియంలో ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన రోలర్ స్కేటింగ్ జిల్లా స్థాయి పోటీలలో విశ్వ కార్తిక్ మూడు బంగారు పతకాలను సాధించాడు. రోడ్డు స్కేటింగ్ పోటీలలో, వన్ లాప్ స్కేటింగ్ పోటీలలో, 5 లాప్స్ స్కేటింగ్ కాంపిటీషన్ లో వరుసగా మూడు బంగారు పతకాలను సాధించి జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేశాడు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన తమ పాఠశాల విద్యార్థి విశ్వ కార్తీక్ ను పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య గురువారం ప్రత్యేకంగా అభినందించారు. తమ పాఠశాల విద్యార్థులను చదువుతోపాటు క్రీడా, సాంస్కృతిక, సైన్స్ ఎక్స్పో, పచ్చదనం పరిశుభ్రత, పర్వదినాల నిర్వహణ, మహనీయుల, జాతీయ పర్వదినాల నిర్వహణ, ఒలంపియాడ్ పోటీలలో ఉన్నతంగా రాణించేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విశ్వ కార్తిక్ అభినందన కార్యక్రమంలో కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య, పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking