77వ స్వతంత్ర వేడుకలలో “జనసేన”

 

జగిత్యాల, ఆగస్టు 15: జనసేన పార్టీ నేత బెక్కం జనార్దన్ ఆధ్వర్యంలో మంగళవారం జగిత్యాలలో 77 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్వతంత్ర భారతావనిలో ప్రతి పౌరుడికి పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలతో సమన్యాయం జరిగే వరకు జనసేన ప్రజలకు అండగా ఉంటుందని బెక్కం జనార్దన్ అన్నారు. భావితరాల సమస్యలపై పోరాటాలను చేసేందుకు జనసేన ఎల్లపుడు సిద్ధంగా ఉంటుందన్నారు. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు జవాబుతారితనంతో ఉండాలని జనార్దన్ కోరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు చింత సుధీర్, పట్టణ ప్రదాన కార్యదర్శి గట్ల శ్రీకర్, పట్టణ వైస్ ప్రెసిడెంట్ తాకూర్ కిరణ్ సింగ్, జగిత్యాల మొగులోజి విజయ, దన కట్ట ఉమాదేవి, మండల అధ్యక్షులు బొల్లి రామ్, మండల వైస్ ప్రెసిడెంట్ బొల్లి లక్ష్మణ్, శివకుమార్, విష్ణు, షాకీర్, ప్రభు, అజయ్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking