సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు
అవునురి మధు, కే గోవర్ధన్ ల పిలుపు
ఖమ్మం ప్రతినిధి జూన్ 27 (ప్రజాబలం) ఖమ్మం భూమి భక్తి విముక్తి కొరకు సాగుతున్న పోరులో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పాత్ర అమో ఘమైనది అందులో భాగంగా నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వివరిస్తూ దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాడి అమరుడైన తొలి అమరవీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని ఖమ్మం నగరంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవు నూరి మధు మాట్లాడుతూ బాంచన్ దొర నీ కాళ్ళు మొక్కుతా అన్న తెలంగాణ మట్టి మనుషులు 1946 నుండి 1952 వరకు రాచరికం భూస్వాముల క్రూర దోపిడి పాలనపై నిప్పులు మరిపించిన మహాత్ర తెలంగాణ సాయుధ రైతంగ పోరాటం, చరిత్రలో ఆజారామమైంది. ఆ పోరాటాల వారసత్వంలో కొనసాగటమే నేటితరం కమ్యూనిస్టుల కర్తవ్యంగా భావించి ఆ పోరాట తొలి అమరవీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం నగరంలో జులై 4 తారీఖు నాడు సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రెండు రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునురి మధు తెలిపారు. ఖమ్మం నగరంలోని టీఎన్జీవోస్ హాలులో జరిగిన ఉభయ పార్టీల రాష్ట్ర నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో అవునురి మధు మాట్లాడుతూ భారతదేశంలో భూమి సమస్య అతి కీలకమైనదని దానిని పరిష్కరించకుండా భారత సమాజంలో సమానత్వం సాధ్యం కాదని తెలిపారు అర్థ వలస అర్ధ భూస్వామ్య సమాజంలో వ్యవసాయానికి విప్లవం ఇరుసుగా నూతన ప్రజాస్వామ్య విప్లవం విజయవంతం కావాలంటే విడి విడిగా ఉన్న విప్లవకారుల ఐక్యతనే నేటి జరూర్ కర్తవ్యం గా ముందుకు వచ్చిందని అన్నారు సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే గోవర్ధన్ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో పేదరికం నిరుద్యోగం విద్యా, అవినీతి అనారోగ్యం, ఆకలి చావులు, ఆత్మహత్యలు కొనసాగుతున్న ఈ సమాజంలో ప్రజల కోసం గత 50 ఏళ్లకు పైగా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న కమ్యూనిస్టు విప్లవకార్లు ఒకే పార్టీగా ఐక్యం కావలసిన అవసరం ఉందని తెలిపారు దేశంలో రాష్ట్రంలో మతోన్మాదం కార్పొరేట్ శక్తులు జమిలీగా అన్ని రంగాల్లో దోపిడిని తీవ్రం చేస్తూ ప్రజలను ఊచ కోతలు కోస్తున్న సందర్భంలో రెక్కాడితే కానీ డొక్కాడని శ్రమజీవులను సంఘటిత పరిచి వారి దయనంధిక పోరాటాలకు పురోగమింప జేయాలని పిలుపునిచ్చారు ఈ సమాజంలో ఉభయ రాష్ట్రాల రాష్ట్ర నాయకులు గౌని ఐలయ్య, పరకాల నాగన్న, ఎం శ్రీనివాస్, ఏం డేవిడ్ కుమార్, తుపాకుల నాగేశ్వరావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్, కోలా లక్ష్మీనారాయణ వెంకట్ రామిరెడ్డి ఐ వెంకన్న, ఎం గిరి, ఖాసిం, సురేష్ , వై ప్రకాష్ , వై జానకి, సుభహాను, సుదర్శన్, ఏ నిర్మల, తదితరులు పాల్గొన్నారు.