కస్తూర్బా పాఠశాలను సందర్శించిన జడ్పిటిసి.

 

జమ్మికుంట ప్రజబలం జనవరి 27

జమ్మికుంట పట్టణంలోని కస్తూర్బా పాఠశాలను సందర్శించిన జడ్పిటిసి డాక్టర్. శ్రీరామ్ శ్యామ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించాలని సూచించడం జరిగింది. పాఠశాల విద్యార్థులకు మెనూ పాటిస్తున్నారా లేదని విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. సిలబస్ సక్రమంగా జరుగుతుందా లేదని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో గదులను శుభ్రంగా ఉంచుకోవాలని వారికి సూచించారు. పరిసరాల ప్రాంతాలను పరిశీలించి వాటిని శుభ్రంగా ఉంచుకొని ఆహ్లాదకరంగా వాతావరణం ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎంతగానో ఖర్చు చేస్తుందని వారు గుర్తు చేశారు. పాఠశాలలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉపాధ్యాయులు బాధ్యతగా ఉండాలని వారికి వివరించడం జరిగింది. ఉపాధ్యాయులు విద్యార్థులను బాగోగులు చూసుకుంటూ విద్యార్థులకు అర్థం అయ్యేరీతిలో బోధించాలని వారు పేర్కొనడం జరిగింది. విద్యార్థులు ప్రశ్నించే గుణం ఉండాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని విద్యార్థులకు గుర్తు చేశారు. మీ పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ అధికారులకు వివరించవలసిందిగా విద్యార్థులకు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మండల విద్యాధికారి వీడుపు శ్రీనివాస్, క్లస్టర్ అధికారి సురేష్, తిరుపతి ,కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking