ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ కు వినతీపత్రం అందజేసిన ఆరె కటిక సంఘం ప్రతినిధులు
జియాగూడ ప్రజాబలం ప్రతినిధి:జియాగూడ స్లాటర్ హౌస్ ను ఆధునీకరించి నిరుపేదలకు ఉపాధి కలిగే విధంగా కృషి చేస్తానని కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ అన్నారు. మంగళవారం జియాగూడ ఆరె కటిక సంఘం అధ్యక్షుడు టి నర్సింగ్ రావు, చర్మకష్ సంఘం అధ్యక్షుడు వి శశికాంత్ రావు, ప్రధాన కార్యదర్శి పి దర్శన్ కుమార్ ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి వినతీపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… గత 50 ఏళ్లుగా జియాగూడ కమేళాపై ఆధారపడి వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని, కమేళాను ఆధునీకరించకపోవడంతో నానాటికీ సమస్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఇతర కమేళాలను ఆధునీకరించినట్లే జియాగూడ కమేళాను ఆధునీకరించి దానిపై ఆధారపడి జీవిస్తున్న వేలాదిమంది కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏకే ట్రస్ట్ ఛైర్మన్ దివాకర్ లాల్, ప్రధాన కార్యదర్శి గురుదాస్, ప్రతినిధులు డి హరికిషన్, కే సాయి కుమార్, ఎం రాఘవేందర్, నరేందర్, వి హరిలాల్, జి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Prev Post