ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 01 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.మంగళవారం 12వ వార్డ్ గోదావరి రోడ్ మస్తాన్ గూడ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల ఉపయోగలపై అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా కౌన్సిలర్ పర్వీన్ సుల్తానా మాట్లాడుతూ…పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తాగించడం వల్ల కలిగే లాభాలను తెలియజేశారు. బిడ్డకు రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా అనారోగ్యాల నుండి కాపాడతాయన్నారు. తల్లిపాలు తల్లి బిడ్డల మధ్య అనురాగాన్నిపెంపొందిస్తాయని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ దీపావహిని, అంగన్వాడి టీచర్లు, ఆయాలు,గర్భిణీ స్త్రీలు, బాలింతలు,కిశోర బాలికలు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking