లేదంటే కుటుంబీకులకు ప్రాణహాని ఉందని
తూప్రాన్ డిఎస్పి, సీఐ కార్యాలయంలో ఫిర్యాదు.
మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా దండుపల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన హత్య కేసులో ఉన్న ఆరుగురి నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేసి నలుగురిని అరెస్టు చేయకపోవడంతో మిగతా నలుగురితో ప్రాణహాని ఉందని సంబంధిత కుటుంబ సభ్యులైన మృతిని బందువులు కుమారుడు మరియు కుమార్తెలు తూప్రాన్ డిఎస్పి, మరియు సీఐ కార్యాలయాలలో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మా తండ్రిని చంపిన నిందితులలో ఇద్దరిని మాత్రమే అరెస్టు చేయడంతో మిగతా నలుగురిని అరెస్టు చేయకపోవడంతో బయట ఉన్న మాకు మా తమ్మునికి ప్రాణహాని ఉన్నదని కుటుంబ సభ్యులు ఒకరు ప్రకటన ద్వారా తెలుపుతూ సంఘటన రోజున పోలీసులు కేసు దర్యాప్తు చేసుకొని ఇద్దరిని మాత్రమే అరెస్టు చేశారని మిగతా నలుగురిని అరెస్టు చేయకపోవడంతో మాకు వారితో ప్రాణహాని ఉన్నదని వాళ్లు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని బిక్కు బిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తలదాచుకుంటున్నామని తక్షణమే పోలీస్ ఉన్నత అధికారులు మిగతా వారిని అరెస్టు చేసి మా కుటుంబ సభ్యులను కాపాడాలని మాకు న్యాయం చేకూర్చాలని తూప్రాన్ డిఎస్పి, సీఐ. కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.