ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 01 : మంచి మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు దమ్మ సునీల్ మంగళవారం రోజు బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సమక్షంలో బిజెపి పార్టీలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా రఘునాథ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో దండేపల్లి మండల అధ్యక్షులు గోపతి రాజయ్య,గుండా ప్రభాకర్, వీరమళ్ల హారి గోపాల్, దమ్మని సత్తయ్య,ముత్తె వెంకటేష్,గుండా రవీందర్, వల్లంభట్ల వంశీ,తాల్లపాల్లి వంశీ,మోటపలుకుల సతీష్,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.