ఉన్నత లక్ష్యాలను సాధించడానికి బీ ఏ ఎంతో ఉపయోగకరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓఝా

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 01 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట ఉన్నత లక్ష్యాలను,ఉద్యోగాలను సాధించడానికి బీ ఏ గ్రూప్ ఎంతో ఉపయోగకరమైనదని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓఝా అన్నారు. మంగళవారం కళాశాలలో బీ ఏ తృతీయ సంవత్సరం విద్యార్థులు ఏర్పాటు చేసిన సిగ్నచర్ డే వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… కొందరు విద్యార్థులు బీ ఏ తో మంచి భవిష్యత్ ఉండదనే అపోహలు కలిగి ఉండటం సరికాదన్నారు. విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తు కు బీ ఏ గ్రూప్ అనేది ఎంతో ముఖ్యమైనదన్నారు.సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, 2 జాబ్స్ తో నోబెల్ ప్రైజ్ లు సైతం సాధించవచ్చన్నారు. స్వయంగా తన కూతురు కూడా బీ ఏ గ్రూప్ లో డిగ్రీ చదవడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా వివరించారు. కరోన వలన కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కృంగి పోవద్దని విద్యార్థులకు హితవు పలికారు. అంతకుముందు పలువురు అధ్యాపకులు తమ జీవిత అనుభవాలను విద్యార్థులకు వివరించారు.అనంతరం ప్రిన్సిపాల్, అధ్యాపకులను విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గంగయ్య, అధ్యాపకులు శ్రీనివాస్, రామచంద్రం,సవిత, శ్రీలత,డాక్టర్ చంద్రశేఖర్, కుమార స్వామి,రాజ లింగయ్య,మల్లేష్, నటరాజ్ కుమార్,సిబ్బంది శ్రీనివాస్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking