ప్రభుత్వం నిరంకుశ వైఖరి సమంజసం కాదు బిఎస్పి నిర్మల్ జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ పారిశుద్ధ్య కార్మికుల ఛలో కలెక్టరేట్ కార్యక్రమానికి మద్దతు పలికిన బిఎస్పి

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లా లో గత 27 రోజుల నుండి గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె ఈరోజు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమానికి బీఎస్పీ నిర్మల్ జిల్లా అద్యక్షులు జగన్ మోహన్ మద్దతు తెలుపుతూ నిర్మల్ కలెక్టర్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది అనంతరం అడ్వకేట్ జగన్ మోహన్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంలో పోలీసు నిఘాతో తెలుసుకునే కేసీఆర్ కు గడిచిన 27 రోజులుగా 50 వేల మంది రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు రోడ్లపై నిరవధిక సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వం వీరి గోడు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్కు రాకుండానే నెలకు. 3,36,000 జీతం తీసుకుంటున్న కేసీఆర్ కు నిత్యం శ్రమదోపిడీకి గురవుతున్న వేలాదిమంది కార్మికులకు మాత్రం సరైన వేతనాలు చెల్లించడంలేదన్నారు వచ్చే ఎన్నికల్లో కార్మికుల ఓట్ల కోసం అనేక హామీలు గుప్పిస్తారని, వాటిని నమ్మి ఆధిపత్య పార్టీలకు ఓట్లు వేసి మోసపోవద్దన్నారు.
తెలంగాణా వస్తే సమ్మె లు,దర్నాలు ఉండవని ఒకప్పుడు వాఖ్యానించిన కె.సి.ఆర్ నేడు పంచాయితీ కార్మికులపై నిరంకుశ వైఖరి అవలంభిస్తూన్నారని,కరోణా సమయంలో పరిశుద్ద కార్మికులు చేసినసేవ మరువలేనిది అని, బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ,మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్చార్జ్ మార రాజన్న, జిల్లా మహిళా కన్వీనర్ లక్ష్మి , నియొజక వర్గ ఇంచార్జీ నిమ్మ గణేష్,
షేక్ అలీమ్ టౌన్ వైస్ పెసిడేంట్.గంగామణి,కరుణ,రాజేశ్ ,ముదోల్ మండల కన్వీనర్ సునీల్ వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking