👉ఆర్టీసీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి
👉పట్టణ 17వ వార్డు కౌన్సిలర్ ఆకుల చిట్టిబాబు
అందోల్ నియోజకవర్గ ప్రతినిధి మార్చి 10 ( ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా:అందోల్ జోగిపేట మున్సిపల్ పట్టణంలోని ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం ప్రైవేట్ వాహనాలకు అడ్డాగా మారిందని, అందోల్ జోగిపేట మున్సిపల్ 17వ వార్డు కౌన్సిలర్, ఆకుల, చిట్టిబాబు ఆరోపించారు, నిన్న ఆదివారం ఆయన బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఆర్టీసీ బస్టాండ్ లో ప్రైవేటు వాహనాలు నిలపడముతో బస్టాండు ప్రాంగణం మొత్తం ఇరుకుగా మారుతుందని అన్నారు, తక్షణమే ప్రైవేటు వాహనాలను బస్టాండ్ లోనికి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆర్టీసీ అధికారులకు సూచించారు, ప్రైవేటు వాహనాలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేశారు, వందల సంఖ్యలో ప్రైవేటు వాహనాలు, బస్టాండ్ లో ఉన్న పార్కింగ్ లో కాకుండా బస్టాండ్ లోపల ఇతర చోట్ల పెట్టడంతో అటు బస్సులు, ఇటు ప్రయాణికులు,తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు, బస్టాండ్ ప్రాంగణం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని సూచించారు, స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి, ఆర్టీసీ, బస్సులకు, ప్రయాణికులకు,ఎలాంటి ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కారం అయ్యే విధంగా, కృషి చేస్తానని ఆయన అన్నారు.