సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్ ఐపియస్

 

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి మార్చ్ 10(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీ గా భాద్యతలు స్వీకరించిన పరితోష్ పంకజ్ ఐపియస్,ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు,ఈయన 2020 బ్యాచ్ కు చెందిన ఐపియస్. స్వస్థలం ఆరా పట్టణం, బోజ్పూర్ జిల్లా, బీహార్ రాష్ట్రం. గతంలో భద్రాచలం అదనపు.ఎస్పీ గా, భద్రాద్రి కొత్తగూడెం ఓ.యస్.డి గా భాద్యతలు నిర్వర్తించారు.అనంతరం జిల్లా పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ డ్యూటి పరంగా లేదా పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా నేరుగా నా దృష్టికి తీసుకురాలని,సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉంటానని అన్నారు,తమకు కేటాయించిన విధులను సక్రమంగా, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు,స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదిదారులతో మర్యాదగా మాట్లాడాలని,వారి సమస్యను ఓపిగ్గా విని సత్వర న్యాయం జరిగేలా చూడాలని అన్నారు,సివిల్ తగాదాలలో తల దూర్చకూడదని,చట్టానికి అనుగూణంగా నడుచుకోవాలని అధికారులకు సూచించారు.అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.శాంతి భద్రతల రక్షణలో 24. గంటలు జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండటం జరుగుతుందని,ముఖ్యంగా మహిళలు, చిన్నారుల భద్రత విషయమై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అల్లరి మూకలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు,జిల్లాలో క్రిమినల్, యం.ఓ నేరస్తుల కదళికల పై ప్రత్యేక నిఘా ఉంచి, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ. సంజీవ రావ్, ఎ.ఓ ఇ. కళ్యాణి, డియస్పీ లు రవీందర్ రెడ్డి, సత్యయ్య గౌడ్, రామ్ మోహన్ రెడ్డి, వెంకట రెడ్డి, సురేందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ఎఆర్ డియస్పీ నరేందర్, జిల్లా ఇన్స్పెక్టర్స్, సబ్-ఇన్స్పెక్టర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking