గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి :: జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

 

ప్రజాబలం ప్రతినిధి
తేది.10.3.2025.
ములుగు జిల్లా.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటిడిఏ పి.ఓ. చిత్ర మిశ్రా, అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావు, డీఎస్పీ రవీందర్ లతో కలిసి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన జిల్లా లో ఉన్న సందర్భంగా ఏర్పాట్లపై సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బుదవారం తెలంగాణ గవర్నర్ దత్తత తీసుకున్న జిల్లాలోని తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామమునకు వస్తున్న నేపథ్యంలో
అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, అనంతరం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుంటారని అన్నారు. గవర్నర్ పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని విజయవంతం చేయాలని ఆదేశించారు. షెడ్యూలు ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పరిశుద్ధ పనులు చేపట్టాలని, అతిథి గృహంలోని గదులను శుభ్రంచేయాలని, శానిటేషన్ చేయాలని సంబంధిత అధికారులను సూచించారు. గవర్నర్ పర్యటన ఏర్పాట్లను కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఎటువంటి లోటు పాట్లు లేకుండా పకడ్బందీగా చేయాలని అధికారులను సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, అన్ని శాఖల జిల్లా అధికారులు,
ములుగు, తాడ్వాయి మండలంల
ఎంపిడిఓలు, తహసీల్దార్లు, ఎం పీలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking